LYF ‘Love Your Father’ grand opening: గతంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి హిట్ సినిమాలు చేసిన మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్- అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త మూవీ లైఫ్ లవ్ యువర్ ఫాదర్. శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ నిర్మాతలుగా ఈ సినిమా తెరక్కుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా ఘనంగా జరిగింది. ఈ క్రమంలో మూవీ కెమెరాను చామకూర శాలిని స్విచ్ ఆన్ చేయగా సిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్ రెడ్డి క్లాప్ కొట్టి స్క్రిప్ట్ ను కూడా అందించారు. ఈ క్రమంలో హీరో శ్రీహర్ష మాట్లాడుతూ ఇది నా మొదటి సినిమా 100% కష్టపడి అందరికీ నచ్చే విధంగా చేస్తానని అన్నారు. మీ సపోర్ట్ మరియు ఆశీర్వాదాలు ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు. దర్శకుడు పవన్ కేతరాజు మాట్లాడుతూ గతంలో కో డైరెక్టర్ గా చాలా సినిమాలకు వర్క్ చేశా, కిషోర్ రాఠీ గారు నన్ను స్వయంగా పిలిచి ఈ సినిమా నాకు ఇవ్వడం జరిగిందన్నారు. సూర్య ది గ్రేట్, దర్యాప్తు, యమలీల, మాయలోడు, వినోదం లాంటి ఎన్నో మంచి హిట్ సినిమాలు అందించిన మనిషా ఫిలిమ్స్ బ్యానర్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ గారు నన్ను పిలిచే అవకాశం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇక ఎస్పీ చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, అంజన్ శ్రీవాస్తవ్ అలాగే అమన్ వేమ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.