Rajini Kanth: మనసిలాయో అంటున్న రజనీకాంత్
- వేట్టైయాన్ - ది హంటర్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్
- మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సైతం స్టెప్పులేస్తూ కనిపించటం విశేషం
- బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajini Kanth: రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ – ది హంటర్ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ పక్కా మాస్ బీట్‌తో అమ్మాయి పాడే పాట వింటుంటే అందరూ స్టెప్పులేయాలనిపిస్తోంది. ఇంతకీ అంతలా అందరినీ మడత పెట్టేలా వచ్చిందెవరో తెలుసుకోవాలంటే ‘వేట్టైయాన్ – ది హంటర్’ సినిమా చూసేయాల్సిందేనంటున్నారు మేకర్స్. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్ – ది హంటర్’. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పేట, దర్బార్, జైలర్ చిత్రాలకు పుట్ స్టాపింగ్ ట్యూన్ అందించి మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ నాలుగోసారి రజినీకాంత్ వేట్టైయాన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ‘మనసిలాయో..’ అంటూ సాగే ఈ పాట వింటుంటే ఎనర్జిటిక్ బీట్‌తో సాగుతుంది.
Also Read: Rashmika Mandanna: రష్మిక’కి ప్రమాదం.. ఏమైందంటే?
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
రజినీకాంత్, మంజు వారియర్ మధ్య వచ్చే పాట అని తెలుస్తుంది. అలాగే ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సైతం స్టెప్పులేస్తూ కనిపించటం విశేషం. సూపర్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టు ఆయన అభిమానులు సహా అందరినీ దృష్టిలో పెట్టుకుని అనిరుధ్ మరోసారి తనదైన పంథాలో బాణీలను అందించినట్లు ‘మనసిలాయో..’ అనే పాటను వింటుంటే తెలుస్తోదిసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీనివాస మౌళి రాసిన ఈ పాటను నకష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేష్ పాడారు. ఆసక్తికరమైన మరో విషయమేమంటే ఈ పాట తమిళ వెర్షన్ కోసం లెజెండ్రీ ప్లే బ్యాక్ సింగ్ మలేషియా వాసుదేవన్ వాయిస్‌ను ఏఐలోక్రియేట్ చేసి ఇందులో ఉపయోగించటం విశేషం. రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వటానికి సిద్ధమవుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..