Rashmika Mandanna minor accident: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్‌లో, రష్మిక తన ప్రమాదం కారణంగా కొంతకాలంగా బయట కనిపించకుండా రెస్ట్ తీసుకుంటున్నానని పేర్కొంది. ప్రస్తుతం డాక్టర్లు రష్మికకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని, రష్మిక చేసిన ఈ పోస్ట్‌తో అభిమానులు టెన్షన్ పడుతూ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో మేకప్ లేని ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక. ఈ ఫోటో షేర్ చేసి ఒక క్యాప్షన్ కూడా రాసింది. ‘అవును, నేను ఇక్కడ యాక్టివ్‌గా ఉండలేదని, పబ్లిక్‌గా కనిపించలేదని మీకు తెలుసు. దానికి కారణం గత నెలలో నాకు ప్రమాదం జరిగింది.
Dilip Prakash : ‘ఉత్సవం’లా మా సినిమా… డైరెక్టర్ తో ఆరేళ్ళ జర్నీ: హీరో దిలీప్ ప్రకాష్ ఇంటర్వ్యూ
ఈ ప్రమాదం చాలా చిన్నది, కానీ డాక్టర్ నన్ను ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవాలని కోరారు. ఇప్పుడు నేను మునుపటి కంటే మెరుగ్గా ఉన్నా, ఇప్పుడు నేను కొన్ని పనులు చేయడంలో మరింత సూపర్ యాక్టివ్‌గా మారినట్లు అనిపిస్తుంది. నేను మీకు చెప్పేది ఒక్కటే, మీరు మీ గురించి మరింత శ్రద్ధ వహించాలి. జీవితంలో ఏమి జరుగుతుందో చెప్పలేము, ఎందుకంటే అది చాలా అనూహ్యమైనది. రేపు ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఇప్పటికైనా సంతోషంగా ఉండాలని ఆమె పేర్కొంది. ఇంతకుముందు, రష్మిక తన పెంపుడు కుక్కతో ఒక అందమైన వీడియోను పంచుకుంది. రష్మిక సినిమాల విషయానికి వస్తే ‘పుష్ప 2 ది రూల్’, ‘ఛావా’, ‘సికిందర్’ ఉన్నాయి. ఇది కాకుండా, ఆమె ఆయుష్మాన్ ఖురానాతో ‘వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్’లో కూడా నటించే అవకాశం ఉంది. ఇక అవి కాకుండా, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘రెయిన్‌బో’, ‘కుబేర్’ వంటి మరో మూడు చిత్రాల పేర్లు చర్చలో ఉన్నాయి.