Lokesh Kanagaraj : రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్.. కీలక విషయాలను వెల్లడించారు. నేను ముందుగా రజినీకాంత్ కు చెప్పిన కథ కూలీ కాదు. ఆయనకు ముందు ఓ ఫాంటసీ కథ చెప్పాను. కానీ దాన్ని తీయాలంటే చాలా టైమ్ పడుతుందని దాని ప్లేస్ లో కూలీ కథను తీశాను. ఈ మూవీలో ఆయన దళపతి మూవీలో ఉన్నట్టు కనిపిస్తారు. మూవీని డబ్బింగ్ రూమ్ లో చూసి రజినీకాంత్ నన్ను హగ్ చేసుకున్నారు. తనకు దళపతి చూసిన ఫీలింగ్ వచ్చిందన్నారు అని చెప్పుకొచ్చాడు లోకేష్.
Read Also : Kriti Sanon : బాయ్ ఫ్రెండ్ తో ప్రభాస్ హీరోయిన్.. లండన్ లో చెక్కర్లు
రజినీకాంత్ ప్రశంసతో చాలా నెలల తర్వాత ప్రశాంతంగా పడుకున్నట్టు తెలిపాడు. ఆయన ప్రశంస నాకు చాలా ముఖ్యమైనది. ఈ మూవీ కోసం రోజుకు 1000 మంది దాకా పనిచేశారు. మూవీ కథకు అవసరం కాబట్టి అంత మంది పనిచేయాల్సి వచ్చింది. ఇది పూర్తిగా డిఫరెంట్ స్టోరీతో వస్తోంది. రజినీకాంత్ ను ఆయన ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో ఇది అలాగే ఉంటుందనే నమ్మకం నాకుంది అంటూ చెప్పుకొచ్చాడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
Read Also : Senthil Kumar : రాజమౌళి-మహేశ్ మూవీ చేయకపోవడానికి కారణం అదే..