Senthil Kumar : రాజమౌళి తన ప్రతి సినిమాలో కొందరిని కంటిన్యూ చేస్తుంటారు. కొందరు యాక్టర్లను రెగ్యులర్ గా తీసుకునే రాజమౌళి.. కొందరు టెక్నీషియన్లను కూడా కంటిన్యూ చేస్తుంటారు. అందులో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సెంథిల్ కుమార్. సినిమాటోగ్రాఫర్ అయిన సెంథిల్ కుమార్ – రాజమౌది ఇరవై ఏళ్ల అనుబంధం. మొదటి నుంచి రాజమౌళి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. బాహుబలి, త్రిబుల్ లాంటి సినిమాలకు ఆయన చేశారు. కానీ ఇప్పుడు రాజమౌళి-మహేశ్ కాంబోలో వస్తున్న సినిమాకు సెంథిల్ కుమార్ చేయట్లేదు. దీనిపై చాలా రకాల రూమర్లు ఉన్నాయి. వాటిపై తాజాగా సెంథిల్ క్లారిటీ ఇచ్చారు.
Read Also : HHVM : వీరమల్లు నుంచి రెండు అప్డేట్లు.. ఏం రిలీజ్ చేస్తారంటే..?
కిరీటి హీరోగా వస్తున్న జూనియర్ సినిమాకు సెంథిల్ కుమార్ పనిచేస్తున్నారు. ఈ మూవీ జులై 18న రాబోతోంది. మూవీ ప్రమోషన్లలో ఆయన ఈ రూమర్లపై స్పందించారు. రాజమౌళిది నాది ఎన్నో ఏళ్ల అనుబంధం. మా మధ్య బ్రేక్ అనేది కొత్త కాదు. గతంలో మర్యాద రామన్న, విక్రమార్కుడు సినిమాలకు కూడా నేను పనిచేయలేదు. అలా అని మా మధ్య రిలేషన్ ఏ మాత్రం దెబ్బతినలేదు. ఇప్పటికీ రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం. మహేశ్ తో చేసే మూవీకి నేను చేయాల్సింది. కానీ అనుకోకుండా కుదరలేదు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని రాజమౌళి అనుకుని ఉండొచ్చు. అందులో తప్పేం లేదు. భవిష్యత్ లో మేం మళ్లీ పనిచేస్తాం అంటూ చెప్పుకొచ్చారు సెంథిల్ కుమార్. భవిష్యత్ లో తనకు డైరెక్టర్ గా చేయాలని ఉందని.. ప్రస్తుతం కొన్ని స్క్రిప్టులపై పనిచేస్తున్నట్టు ఆయన వివరించారు.
Read Also : Prabhas : ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటామన్న స్టార్ హీరోయిన్లు..