సూపర్ స్టార్ రజినీకాంత్… తన రేంజ్ హిట్ కొట్టి చాలా రోజులే అయ్యింది. ఆ గ్యాప్ కి ఫుల్ స్టాప్ పెట్టి జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు రజినీకాంత్. మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చేసిన జైలర్ సినిమా రజినీకాంత్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసేలా చేసింది. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఎన్నేళ్లు హిట్ లేకపోయినా రజినీ అనే వాడికి ఒక యావరేజ్ సినిమా పడినా చాలు బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్ల సునామీ చూస్తామని నిరూపిస్తోంది జైలర్. 2023 కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన జైలర్ సినిమా దెబ్బకి తమిళ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి.
ఇవి రజినీ దెబ్బకి క్రియేట్ అయిన రికార్డ్స్, ఈ వీక్ ఎండ్ అయ్యే సమయానికి జైలర్ మరిన్ని రికార్డ్ క్రియేట్ చేయనుంది.