ప్రస్తుతం బాలీవుడ్ చూపు అంతా టాలీవుడ్ మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క స్టైలిష్ మేకోవర్ తో టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్ లాంటి వారు ముంబై లో స్టైలిష్ మేకోవర్ లో కనిపిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా లైగర్ బ్యాచ్ బాలీవుడ్ గ్రాండ్ పార్టీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో దుమ్ము లేపింది లైగర్ టీమ్. గత రాత్రిధర్మ ప్రొడక్షన్స్ అధినేత అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలు ముంబై లో గ్రాండ్ గా జరిగాయి. బాలీవుడ్ ప్రముఖులతో ఆ వేదిక కళలాడుతుంది.
ఇక ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న లైగర్ టీమ్ అందరి దృష్టిని ఆకర్షించారు. స్టైలిష్ బ్లాక్ సూట్ లో విజయ్ దేవరకొండ బాలీవుడ్ హీరోయిన్ల మనసులను కొల్లగొట్టాడనే చెప్పాలి. ఇక డైరెక్టర్ పూరీ జగన్నాధ్, నిర్మాత ఛార్మి సైతం బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపించి కనువిందు చేశారు. వీరి యూనిక్ స్టైల్ చూసిన బాలీవుడ్ కెమెరా మ్యాన్ లు విజయ్ సార్.. విజయ్ సార్ అంటూ ఫోటల కోసం వెనకపడుతూ మరీ ఫోటోలు తీయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే లైగర్ సినిమా షూటింగ్ మేజర్ భాగం పూర్తుయ్యిందని తెలుస్తోంది.. అందుకే వీడీ లుక్ కూడా చేంజ్ అయ్యింది. మొన్నటివరకు లాంగ్ హెయిర్ తో కనిపించిన విజయ్ ఇప్పుడు స్టైలిష్ లుక్ లో కనిపించి మెప్పించారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ రౌడీ బ్యాచ్ గురించే చర్చ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది.