LGM – Let’s Get Married Telugu Trailer: పెళ్లి చేసుకుని ఓ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టాల్సిన అమ్మాయి తన ప్రేమికుడిని విచిత్రమైన కోరిక కోరుతుంది, వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. తనకు కాబోయే అత్తవారితో కలిసి కొన్ని రోజులు ట్రిప్‌కు వెళతానని అప్పుడు ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికీ తెలుస్తుందని చెప్పి ట్రిప్ ప్లాన్ చేస్తారు. అలా కాబోయే అత్తా కోడలు.. కలిసి చేసే ప్రయాణం.. వారి మధ్య ఉన్న అబ్బాయి వారి సమస్యలను సర్దుబాటు చేయలేక పడే బాధలను తెలుసుకోవాలంటే ‘ఎల్‌జీఎం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ LGM సినిమాను రూపొందిస్తున్నారు.
Kangana Ranaut: ఆలియాతో విడిపోవడానికి రణబీర్ ప్రయత్నిస్తున్నాడు.. అందుకు నా సాయం కోరాడు
ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కు రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించటంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తే ఇప్పటి వరకు మన సినిమాల్లో రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో LGM తెరకెక్కుతుందని అర్థమవుతుంది. ఇక సినిమాలో హీరో హరీష్ కళ్యాణ్, హీరోయిన్ ఇవానాతో పాటు హీరో తల్లిగా నటించిన నదియా ఆకట్టుకున్నారు. ఆ ట్రైలర్ మీద మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.