దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ‘లియో’. ఈ మూవీతో కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాలని విజయ అండ్ లోకేష్ చూస్తున్నారు. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ మైంటైన్ చేస్తున్న లియో సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అక్టోబర్ 19న పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ లియో సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. లియోకి తెలుగులో బాలయ్య భగవంత్ కేసరి నుంచి, హిందీలో టైగర్ ష్రాఫ్ గణపథ్ నుంచి, కన్నడలో శివ ఘోస్ట్ సినిమా నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ఈ సినిమాల దెబ్బకి ఆయా రీజన్స్ లో లియో సినిమాకి థియేటర్స్ దొరకడం కష్టమయ్యింది. ఈ కష్టాన్ని దాటుకోని లియో సినిమా ఎన్ని కోట్లు రాబడుతుంది అనేది ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో ఉన్న డౌట్. ఇంత కాంపిటీషన్ ని తట్టుకోని లియో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే విజయ్ కి తిరుగులేకుండా పోతుంది.
ఇదిలా ఉంటే లియో సినిమా ఆడియో లాంచ్ కి తమిళనాడు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ ఇప్పటికే జరగాల్సిన లియో ఆడియో లాంచ్ క్యాన్సిల్ అవ్వడంతో డైరెక్ట్ ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఒక్క ఈవెంట్ కూడా చేయకపోతే బాగోదు అనుకున్నారో ఏమో కానీ లియో ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో చేయనున్నారు. లియో తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సితారా ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. నాగ వంశీ లియో మూవీ తెలుగు ప్రమోషన్స్ కోసం ఈవెంట్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లు మాత్రమే రానున్న ఈ ఈవెంట్ డేట్ అండ్ వెన్యూ త్వరలో అఫీషియల్ గా బయటకి రానున్నాయి. మరి హీరో లేకుండా ప్రమోషనల్ ఈవెంట్ ఎందుకు పెడుతున్నారో ఆ ఈవెంట్ చేసే వాళ్లకే తెలియాలి.