బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొంది కొద్దీరోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. గత రాత్రి మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి పెద్ద షాక్‌గా మారింది. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర, 1960లో సినిమాల్లో అడుగుపెట్టి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు.
Also Read : Mowgli : రోషన్ కనకాల కోసం బరిలోకి జూనియర్ ఎన్టీఆర్
యాక్షన్ సీన్స్, స్టైల్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఆయనకు ‘హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్’, ‘యాక్షన్ కింగ్’ అనే బిరుదులు దక్కాయి. ‘షోలే’లో వీరూ పాత్రతో ఆయన ఇంటి పేరుగా మారారు. అలాగే డ్రీమ్ గర్ల్, లోఫర్, దోస్త్, మేరా నామ్ జోకర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. నటుడిగా అందరికీ స్ఫూర్తి అయిన ధర్మేంద్ర, ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.అలాగే ఆయనకు భారత ప్రభుత్వం 2012లో పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేసింది. ధర్మేంద్ర కి ఇద్దరు భార్యలు ఉన్నారు — ప్రకాశ్ కౌర్ మరియు హేమమాలిని. ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ బాలీవుడ్‌లో ప్రముఖ హీరోలు. తన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించిన ధర్మేంద్ర మృతి సినీ అభిమానులను తీవ్రంగా కలచివేసింది. అయితే ధర్మేంద్ర మృతి పట్ల వారి ఫ్యామిలీ నుండి ఎటువంటి అధికారక ప్రకటన రాలేదు.