బాలీవుడ్ *”హీ-మ్యాన్”*గా పిలువబడే ధర్మేంద్ర వయో భార రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యల కారణంగా కన్ను మూశారు. నిజానికి ఆయన జీవిత ప్రయాణం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు దిలీప్ కుమార్‌ను తన ప్రేరణగా భావించిన ఆయన, కృషి, అంకితభావంతో గాడ్‌ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన డజన్ల కొద్దీ హిట్ చిత్రాలను అందించారు. ఆరు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను అనేక అవార్డులు గౌరవాలతో సత్కరించబడ్డారు.…
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొంది కొద్దీరోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. గత రాత్రి మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి పెద్ద షాక్‌గా మారింది. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర, 1960లో సినిమాల్లో అడుగుపెట్టి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు.…