సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “సర్కారు వారి పాట” మూవీ. మహేష్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం “సర్కారు వారి పాట” మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “కళావతి”, “పెన్నీ” సాంగ్స్ కు మంచి స్పందన రాగా, సినిమాలో నుంచి మూడవ పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఊర మాస్ సాంగ్ విడుదలకు ముహూర్తం ఖరారయ్యింది అంటూ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అందులో టైటిల్ సాంగ్‌ను ఏప్రిల్ 23న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Read Also : Maruthi : స్టార్ డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం
మరోవైపు తనదైన స్టైల్ లో విడుదలకు ముందే చిన్న చిన్న వీడియోలను రిలీజ్ చేస్తూ తమన్ సాంగ్ పై ఆసక్తిని పెంచేస్తున్నాడు. తాజాగా “సర్కారు వారి పాట” సాంగ్ కు సంబంధించిన చిన్న మ్యూజిక్ వీడియోను విడుదల చేశాడు. మరి ఈ మాస సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
#SarkaruVaariPaata #SVPTitleSong Will BomB 💣 ur Ears 🚀 let’s Get #Synthefied 🎛🧨 #SarkaruVaariPaataMusic 🏆🔥 pic.twitter.com/9DNCUMjRdg
— thaman S (@MusicThaman) April 20, 2022
From 23 Rd it’s Going to Be an #Unstoppable #SarkaruVaariPaata Mania 🔥❤️💣🙌🏿🏆 !!
MASSSSSSSSSSSSSSSS 💃💃💃💃💃💃💃 pic.twitter.com/ztfUs0CFYJ
— thaman S (@MusicThaman) April 20, 2022