పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల కారణంగా కొన్ని వారాల నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈ స్టార్ హీరో న్యూ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో పవన్ నుదుట కుంకుమ పెట్టుకుని కుర్చీలో కూర్చుని కూల్ లుక్ లో కన్పిస్తున్నారు. ఈ లేటెస్ట్ పిక్ చూసిన మెగా అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఈ పిక్ నెట్టింట్లో భారీ సంఖ్యలో షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు.
Read Also : “ఏజెంట్”తో సురేందర్ రెడ్డి చర్చలు
ప్రస్తుతం పవన్ మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియుమ్” తెలుగు రీమేక్ కోసం రానా దగ్గుబాటితో స్క్రీన్-స్పేస్ పంచుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దాని కోసమే మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చుస్తునారు. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా నుంచి “భీమ్లా నాయక్” అంటూ పవన్ కళ్యాణ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆ పేరు, సినిమాలో పోలీస్ గా పవన్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాకు అదే పేరును ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో “పిఎస్పీకే 28″తో పాటు క్రిష్ దర్శకత్వం వహించిన చారిత్రక డ్రామా “హరి హర వీర మల్లు”ను కూడా తిరిగి ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఆ తరువాత సురేందర్ రెడ్డితో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది.