టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా కారణంగా విశ్వక్ వరుస వివాదాల్లో ఇరుక్కున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫ్రాంక్ వీడియో చేయడం, అది కాస్తా వైరల్ గా మారి న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఆ వీడియో గురించి విశ్వక్ ఒక ఛానెల్ లో డిబేట్ కి వెళ్లి యాంకర్ ను అనరాని మాట అని మరో వివాదాన్ని కొనితెచ్చుకున్నాడు. ఒక పక్క ఈ వివాదాలకు ఆన్సర్ చెప్తూనే మరోపక్క సినిమా ప్రమోషన్స్ చేసుకొని అభిమానుల మనసులను గెలిచిన ఈ హీరో ఎట్టకేలకు హిట్ ని అందుకున్నాడట.
నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. ఇప్పటికే ప్రివ్యూ లు చూసి స్టార్ హీరోలు సినిమా సూపర్ అంటూ రివ్యూలు ఇచ్చిన విషయం విదితమే. తాజాగా నేడు థియేటర్ల వద్ద కూడా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుందని సమాచారం. మొత్తానికి ఈ వివాదాల హీరో హిట్ కొట్టినట్లు సమాచారం. ఇక సినిమా విషయానికొస్తే 30 ఏళ్లు దాటినా పెళ్లి కానీ ఒక కుర్రాడి కథ. పెళ్లికాని యువకులను ఇంకా పెళ్లి చేసుకోలేదని బంధువులు, స్నేహితులు ఎలా చూస్తారు.. 30 ఏళ్ళు దాటినా కుర్రాడు పెళ్లి చేసుకోకపోవడం నేరమా..? అని సున్నితమైన టాపిక్ ను వినోదాత్మకంగా చూపించాడు డైరెక్టర్. మరి ఈ సినిమా ముందు ముందు ఎలాంటి రికార్డ్ సృష్టింస్తుందో చూడాలి.