కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా కూడా కోలీవుడ్ లో సూర్యకు మంచి పేరు ఉంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా సూర్య ఎంతోమంది పేదలను ఆదుకుంటున్నారు. అగారం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పిల్లలను చదివిస్తున్నాడు. ఇక తాజాగా మరోసారి సూర్య తన ఉదారమనసు చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో .. దర్శకుడు బాలా కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సూర్య కెరీర్లో 41వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య ఒక జాలరిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. చెన్నైలోని ఒక ప్రాంతంలో కొన్ని గుడిసెలతో ఒక గ్రామాన్ని నిర్మించబోతున్నారట మేకర్స్.. భారీ ఖర్చుతో వేస్తున్న ఈ గుడిసెలను షూటింగ్ తరువాత తీసివేయకుండా చెన్నైలో ఇళ్లు లేని మత్య్యకారులకు ఉచితంగా ఇవ్వాలని సూర్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మత్స్యకారుడి పాత్ర కోసం వారి జీవితాన్ని దగ్గరనుంచి చుసిన సూర్య ఉండడానికి వారికి ఇల్లు కూడా లేకపోవడంతో చలించిపోయి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చిత్ర బృందం తెలుపుతోంది. ఏదిఏమైనా సూర్య చేసిన పనికి ఆయన అభిమానులే కాకుండా ప్రతిఒక్కరు అభినందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుంది.. సూర్య – బాలా కాంబో అనగానే ‘నందా’, ‘పితామహన్’ చిత్రాలు టక్కున గుర్తుకు వస్తాయి. సూర్య కెరీర్ బెస్ట్ సినిమాలు అంటే అవేనని చెప్పొచ్చు.. మరి ఆ లిస్ట్ లో ఈ సినిమా కూడా చేరుతుందేమో చూడాలి.