‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ మంచి జోష్ మీద ఉన్నాడు. ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో జోరు పెంచేశాడు. ఇప్పటికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 చేస్తున్న విషయం విదితమే.. ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన బాలయ్య ఫస్ట్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య- అనిల్ రావిపూడి కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు అనిల్ తెలిపాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో బాలయ్య కూతురు గా హాట్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా గురించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలయ్య సరసన ఒక కుర్ర బ్యూటీ నటిస్తోందని సమాచారం.
ఇటీవలే ‘ఎఫ్ 3’ చిత్రంలో మంచి హాట్ గా కనిపించిన మెహరీన్ ఫిర్జాదా ను హీరోయిన్ గా అనిల్ ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్ 2 చిత్రంలో హానీ పాత్రతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత పెళ్లి పీటలు ఎక్కాలని ట్రై చేసింది. కొన్ని విబేధాల కారణంగా పెళ్లి ను క్యాన్సిల్ చేసుకొని బొద్దుగా ఉన్న అమ్మడు చిక్కి అవకాశాలను దక్కించుకొంటుంది. అయితే ఇక్కడ బాలయ్య అభిమానులు మాత్రం సన్నగా ఉన్న ఆమె బాలయ్య సరసన హీరోయిన్ గా కనిపించడం బాగోదని, కొంచెం బాలయ్యకు తగ్గ జోడిని చూడాలని అనిల్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.