Mega 154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే గాడ్ ఫాదర్ ను పూర్తిచేసిన చిరు.. మెహర్ రమేష్ తో బోళా శంకర్.. బాబీ తో మెగా 154 చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే రవితేజ.. ఈ సినిమా సెట్ లో పాల్గొన్న విషయం విదితమే. కాగా.. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ వాల్తేరు వీరయ్య అంటూ చిరు లీక్ చేయగా అఫిషీయల్ ఎనౌన్స్ మెంట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ ఒక స్టోరీ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో రవితేజ, చిరంజీవి అన్నదమ్ములుగా కనిపించనున్నారట.. తల్లులు వేరు అయినా తండ్రి ఒక్కడే కావడంతో సవతి సోదరులుగా చిరు, రవితేజ కనిపించనున్నారట. ఇక అన్న చిరు మీద తమ్ముడు రవితేజకు చిన్నప్పటి నుంచి కోపం ఉంటుందని, దాన్ని పోగొట్టడానికి చిరు ప్రయత్నం చేస్తుంటాడని టాక్. ఇక వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అన్ని హై వోల్టేజ్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇద్దరు హీరోల అభిమానులకు థియేటర్లో పూనకాలే. ఇక చిరు- రవితేజ కాంబో గతంలో అన్నయ్య సినిమాలో వచ్చింది. అందులోనూ రవితేజ.. అన్న చిరుకు ఎదురుతిరుగుతాడు. ఇప్పుడు ఇందులోనూ అన్నకు ఎదురు తిరిగే క్యారెక్టర్ అంటున్నారు. మరి వీరి కాంబో ఎలా ఉండనుందో చూడాలి అంటున్నారు అభిమానులు.