టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తుండగా.. తెలుగులో పూరి- ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఇక పూరి సినిమా అంటే ఐటెం సాంగ్ కు పెట్టింది పేరు.. ఆయన ప్రతి సినిమాలోనూ ఒక మాస్ సాంగ్ తప్పక ఉండాల్సిందే. ఇక లైగర్ సినిమాలోనూ అలాంటి ఊర మాస్ సింగ్ ఒకటి ఉండబోతుంది అన్న విషయం విదితమే.
ఇక ఈ సాంగ్ కోసం ఇప్పటికే కెజిఎఫ్ 2 భామ శ్రీనిధి శెట్టి ని ఎంపిక చేశారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే అందులో నిజం లేదని శ్రీనిధి సన్నిహితులు తెలపడంతో ఆ వార్తలకు చెక్ పడింది. ఇక తాజాగా మరో స్టార్ హీరోయిన్ ఈ సాంగ్ లో స్టెప్స్ వేయనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమె ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. విజయ్ కు రష్మిక కు మధ్య ప్రేమాయణం నడుస్తుందని వార్తలు నడుస్తున్న విషయం తెల్సిందే. అయితే తమ మధ్య స్నేహం తప్ప మారేది లేదని తెలిపిన ఈ జంట ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక ఐటెం సాంగ్ చేస్తే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రష్మిక వద్దకు ఈ ప్రపోజల్ కూడా వెళ్లడం.. విజయ్ కోసం ఆమె చేస్తాను అని చెప్పడం కూడా జరిగాయని సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ .. ఒకవేళ ఇదే కనుక నిజమైతేథియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటున్నారు అభిమానులు. మరి కొన్ని రోజుల్లో ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.