‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ సినిమా తరువాత ‘చందమామ’ చిత్రంతో టాలీవుడ్ చందమామ గా మారిపోయింది కాజల్. ఇక వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ను వివాహమాడిన కాజల్.. పెళ్లి తరువాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే పెళ్లి తరువాత చిరు సరసన ఆచార్య ఆచిత్రంలో నటించింది. అయితే కొన్ని కారణాల వలన ఆమెను సినిమా నుంచి తొలగించారని కొరటాల శివ చెప్పడంతో కాజల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచిన్న కాజల్ ప్రస్తుతం తల్లి ప్రేమలోని మధురానుభూతిని ఆస్వాదిస్తుంది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ చిన్నగా సినిమాలనుంచి సైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు.
‘ఆచార్య’ లో కాజల్ ను తొలగించారని అభిమానులు అంతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నా కాజల్ మాత్రం ఆ విషయంపై ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అయితే పూర్తిగా రెమ్యునరేషన్ అందడం వల్లే కాజల్ ఈ సినిమా పై స్పందించలేదనే వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు మాత్రం తన బిడ్డ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని సినిమాలకు దూరం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నీల్ కిచ్లూ బాధ్యతలను తల్లిగా ప్రేమతో నిర్వర్తించాలని కాజల్ అనుకుంటుందని, గౌతమ్ సైతం ఆమె నిర్ణయాన్ని సమర్దించడంతో నిదానంగా ఆమె సినిమాలకు దూరం కానుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే కాజల్ చెల్లి నిషా కూడా పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన విషయం విదితమే.. ఇక ఈ అక్కాచెల్లెళ్లు సినిమాలను వదిలి కుటుంబ బాధ్యతలను అందుకొని మంచి గృహిణిలుగా సెటిల్ అయిపోతున్నారు అన్నమాట. అయితే ఇందులో నిజమెంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం విన్న కాజల్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతూ కాజల్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.