బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ పేరు చిత్ర పరిశ్రమలో మారుమ్రోగిపోతుంది. కెజిఎఫ్ 2 చిత్రంలో ప్రధానమంత్రి రమికా సేన్ గా అమ్మడి నటన అద్భుతం.. ఈ సినిమాతో ఒక్కసారిగా రవీనా మరోసారి అందరి దృష్టిలో పడింది. తెలుగులో ‘బంగారు బుల్లోడు, రథసారథి, ఆకాశవీధిలో’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇన్నాళ్లకు కెజిఎఫ్ 2 చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక దీంతో టాలీవుడ్ లో అమ్మడికి వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవీనా టాండన్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భవదీయుడు భగత్ సింగ్ లో ఒక కీలక పాత్ర కోసం రవీనా ఎంపిక అయ్యినట్లు తెలుస్తోంది.
గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఏ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే హరీష్ శంకర్.. ఒక కీలక పాత్ర కోసం రవీనాను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథ, పాత్ర కూడా నచ్చడంతో రవీనా టాండన్ కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ సినిమాపై అంచనాలు ఇంకా ఆపెరిగిపోవడం ఖాయం. మరి త్వరలోనే ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.