Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజినీ కాంత్ సరసన రమ్య కృష్ణ నటిస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన రజినీకాంత్ పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోకి మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ఎంట్రీ ఇచ్చాడు.
నేడు ఈ షూటింగ్ లో మోహన్ లాల్ జాయిన్ అయ్యినట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. అంతేకాకుండా మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పులి చారల చొక్కాలో కళ్లజోడు పెట్టుకొని ఎంతో స్టైలిష్ గా కనిపించాడు మోహన్ లాల్. అయితే మోహన్ లాల్ విలన్ గా నటిస్తున్నాడా..? లేక కీలక పాత్రలో నటిస్తున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది.ఇకపోతే ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. ఈ చిత్రం రజినీకి, డైరెక్టర్ నెల్సన్ కు కీలకమని చెప్పాలి. బీస్ట్ తో భారీ పరిచయాన్ని అందుకున్నాడు.. గత కొన్నేళ్లుగా రజినీకి సరైన హిట్ లేదు. దీంతో ఈ సినిమాపైనే వారి ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.