ముంబైలోని లాల్ బాగ్ రాజా వినాయక మండపం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాదులో ఖైరతాబాద్, బాలాపూర్ ఎంత ఫేమస్ అయితే, ముంబైలో ఇది కూడా అంతే ఫేమస్. అయితే, అక్కడి నుంచి ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. లాల్ బాగ్ రాజాను దర్శించుకునేందుకు నటీమణులు ప్రగ్యా జైస్వాల్‌తో పాటు ప్రియాంక చౌదరి వెళ్లారు. అయితే, అక్కడ వారికి ఎలాంటి స్పెషల్ ట్రీట్‌మెంట్ లభించలేదు. సామాన్య భక్తులతో పాటు వారు వెళ్లి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో, ఒక్కసారిగా వారందరినీ చుట్టుముట్టేసిన పరిస్థితి కనిపించింది. ఒక రకంగా వారిపై దాడి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.
Also Read:Soubin Shahir: ఫైనాన్షియల్ ఫ్రాడ్.. మంజుమ్మల్ బాయ్ కి షాక్
నిజానికి సెలబ్రిటీలనే కాదు, వెళ్లిన సామాన్య భక్తులకు కూడా ఈ మండపంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఒకరైతే తన సోదరి తలకు గాయమైందని చెప్పితే, మరొకరు తన తల్లి డ్రెస్ చినిగిపోయిందని పేర్కొన్నారు. మరొకరు తన తండ్రి ఊపిరాడక సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వీరిలో కొంతమంది, సెలబ్రిటీలు వచ్చినప్పుడు మాత్రం వారికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని, ప్రియాంక చౌదరి, ప్రగ్యా జైస్వాల్ వంటి వారు వచ్చినప్పుడు వారిని సైతం ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. గతంలో కూడా జాక్‌లిన్ ఫెర్నాండిస్, అవినీత్ కౌర్ ఇలా ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోకపోతే, విమర్శలు ఎదుర్కోక తప్పదు.