Dheera Release Date: ప్రస్తుతం యంగ్ హీరోలు సిల్వర్ స్క్రీన్ మీద వండర్లు క్రియేట్ చేస్తూ న్యూ ఏజ్ కంటెంట్‌తో వచ్చి హిట్లు కొడుతున్నారు. అలా టాలీవుడ్ నుంచి యంగ్ హీరోగా వచ్చి లక్ష్ చదలవాడ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడు మీదున్నారు. ఇప్పటికే వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి సినిమాలు చేసి తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ధీర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది సినిమా యూనిట్. ఈ క్రమంలోఈ ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఈ ధీర సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి, ఈ క్రమంలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో లక్ష్ చదలవాడ నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కన్నా పీసీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.