మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. సామాజిక కథాంశం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నుంచి ‘లాహే లాహే’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ ను దాటేసింది.
Read Also : ఆగష్టు 22న మెగా అప్డేట్… అంతా రాజమౌళి చేతుల్లోనే ?
80+ మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ సాంగ్ విడుదలై చాలా రోజులవుతోంది. అయినా ఇప్పటికీ అదే జోరుతో కొనసాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ సిద్ధా పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రం మే 13న విడుదల కావాల్సివుండగా.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.