మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సరసన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ నటించింది. నిజ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టి ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు , తమిళ్, మలయాళం , హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో రచ్చ చేసిన ఈ సినిమా ఓటిటీ లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.