కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య నేడు కుబేర వరల్డ్ వైడ్ గా రిలీజ్ థియేటర్లలో రిలీజ్ కాగా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది.
ఓవర్సీస్ ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే. పాజిటివ్ విషయానికి వస్తే కుబేర అనేది మెచ్చుకోదగిన క్రైమ్ డ్రామా. హీరో ధనుష్ తన కెరీర్‌లో అత్యుత్తమ నటన కనబరిచాడు. శేఖర్ కమ్ముల, ఎప్పటిలాగే సినిమా స్టార్టింగ్ నుండి కథను చెప్పడంలో ఎక్కడ తడబడకుండా తనదైన మార్క్ తో అద్భుతంగా తెరకెక్కించాడు. నాగార్జునకు ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్ర రోల్ పడింది. మంచి ఈజ్ తో తన స్టైల్ లో చాలా బాగా చేస్తాడు. రష్మిక తన పాత్రకు సరిగ్గా సరిపోతుంది. DSP సంగీతం మెచ్చుకోవాలి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాను మరింత ఎలివేట్ చేసేలా మెప్పించింది. సెకండ్ హాఫ్ లో కనీసం 4-5 భావోద్వేగ సన్నివేశాలు ఆడియెన్స్ ను కదిలిస్తాయి. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. నెగిటివ్ పాయింట్స్ అంటే .. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీ గా ఉంటె బాగుండేది, అలాగే మూడు గంటల రన్ టైమ్ తో కాస్త సాగతీసిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే శేఖర్ కమ్ముల చక్కని రచన & అద్భుతమైన కథనంతో ఒక కొత్త, భావోద్వేగాలతో కూడిన చిత్రాన్ని అందించారు. తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా కుబేర.