కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.’ఉప్పెన’ సినిమా తో తెలుగు లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతో నే భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.మొదటి సినిమాతో నే తన అందం మరియు అభినయం తో ఎంతగానో మెప్పించింది.ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.తరువాత చేసిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.టాలీవుడ్ లో హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు పొందింది..కానీ ఆ తరువాత ఈ అమ్మడు చేసిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి.హీరో రామ్ మాస్ దర్శకుడు లింగస్వామి దర్శకత్వం లో వచ్చిన వారియర్ సినిమాలో నటించింది. ఆ సినిమా అటు తమిళం లో ఇటు తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత నితిన్ హీరో గా వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరించింది.
సుధీర్ బాబుతో చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా లో కృతి అద్భుతంగా నటించింది. కానీ ఆ సినిమా కూడా ఈ అమ్మడికి హిట్ ఇవ్వలేదు.సినిమా లో తన పాత్ర గురించి ఆలోచించకుండా సినిమాలు ఒప్పుకోవడంతో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ఇటీవల నాగచైతన్యతో నటించిన కస్టడీ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఓ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్న కృతి శెట్టి ఎల్లో కలర్ శారీలో అదరగొట్టింది.రోడ్డుమీద నడుచుకుంటూ ఆమె కెమెరాలకు ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమం ఓ స్టూడియోలో జరగనున్న నేపథ్యంలో చీర కట్టులో మెరిసింది కృతి శెట్టి. శారీ లో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది ఈ భామ.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.