Krithi Shetty: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ.. ఈ ఒక్క సినిమా తరువాత ఏ ఒక్క సినిమాకు అలాంటి హిట్ ను అందుకోలేదు. ఇక ఈ మధ్యే రిలీజ్ అయిన కస్టడీ సినిమా కూడా అమ్మడికి కలిసి రాలేదు. దీంతో కృతిపై ట్రోలర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతకాకుండా.. ఉప్పెన తరువాత ఆమెలో మార్పు వచ్చిందని, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ కు కృతి చెక్ పెట్టింది.
Mem Famous Trailer: బర్త్ డే నాడు ఎవడైనా కేక్ కట్ చేయిస్తాడు… కల్లు తాపిస్తాడా?
కృతిపై వస్తున్న రూమర్స్ పై ఆమె మాట్లాడుతూ.. ” ఎలా ఇలాంటివి రాస్తారు.. వాళ్లకు కూడా కుటుంబం ఉంటుందని వాళ్ళు ఎందుకు ఆలోచించరు. మా కుటుంబాలు కూడా ఆ రూమర్స్ వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పాజిటివ్ గా రాయడం మీకు రాదా..? అని అడగలనిపిస్తుంది” అని చెప్పుకొచ్చింది. ఇక ప్లాస్టిక్ సర్జరీ గురించి మాట్లాడుతూ.. ” నేను ఉప్పెన లో ఉన్నట్లు ఇప్పుడు లేను.. అని చెప్పకొస్తున్నారు. అప్పుడు.. ఇప్పుడు ఒకేలా ఉండలేను.. కొన్నిసార్లు.. మేకప్, హెయిర్ స్టైల్ వలన ముఖం కొత్తగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు నేను ఎదుగుతున్నాను.. ఫీచర్స్ మారుతున్నాయి. దానికి నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను అని చెప్తున్నారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పోతే ప్రస్తుతం కృతి చేతిలో సినిమాలు లేవు.. మరి ముందు ముందు ఆమె ఎలాంటి సినిమాలను ఎంచుకొంటుంది.. మళ్లీ బేబమ్మ లా పూర్వ వైభవం ఎప్పుడు తెచ్చుకుంటుంది అనేది చూడాలి.