ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తగా వచ్చిన హీరోయిన్స్ ఎవరైనా స్టార్ డమ్ సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదీ టాప్ హీరోల చిత్రాలలో నటించి అవి సూపర్ హిట్ అయితే అప్పుడు వారికి గుర్తింపు వస్తుంది. ఈలోగా వారిలో నటనా సామర్థ్యం ఉందని తేలితే అప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలలో వారికి అవకాశాలు లభిస్తుంటాయి. అయితే ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి తన కెరీర్ ప్రారంభ దశలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతోంది. తొలి చిత్రం ‘ఉప్పెన’ గ్రాండ్ సక్సెస్ తో కృతిని వరుస అవకాశాలు చుట్టుముట్టాలి. అయితే అమ్మడు గ్లామర్ పరంగా ఓకె అయినా నటనలో బాగా వీక్ సోషల్ మీడియాలో బాగా ప్రచారం లో ఉంది. ‘ఉప్పెన’ షూటింగ్ టైమ్ లో అమ్మాయిగారి నుంచి నటనను రాబట్టడానికి యూనిట్ తలక్రిందులైందట. అయినా ఆ సినిమా హిట్ తో దాదాపు అరడజను సినిమాలు కృతి కిట్టీలో ఉన్నాయి. అయినా ఆమెకు ఇంకా 20 ఏళ్లు కూడా నిండలేదు. అందుకేనేమో ఇప్పటి వరకూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలేవీ అమ్మడిని పలకరించలేదు.
అవకాశం వస్తే మాత్రం తను ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాకు రెడీ అని కృతి అంటోంది. ఆమె మనసును చదివారో ఏమో కానీ మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత, ‘ఉయ్యాల జంపాలా’, ‘మజ్ను’ చిత్రాల దర్శకుడు విరించి వర్మ కృతితో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడ నుంది. కృతి నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ట్రైలర్, పాటలతో ఆకట్టుకుంటున్న ఈ సినిమా హిట్ అయితే మాత్రం కృతి శెట్టి క్రేజ్ మరింతగా పెరగటం ఖాయం.