Krithi Shetty : కృతిశెట్టి కలల మీద నీళ్లు చల్లిన బాలీవుడ్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన ముద్దు ముద్దు నడవడి, అమాయకమైన లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’, ‘ది వారియర్’ వంటి చిత్రాలతో వరుసగా బిజీ అయిపోయింది. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కృతి కెరీర్ కొంచెం డౌన్ ట్రాక్‌లోకి వెళ్లింది. ఇక దీంతో కృతి తన దృష్టిని బాలీవుడ్ వైపు మళ్లించింది. “హిందీ ఆడియెన్స్ ముందు తన టాలెంట్ చూపించాలనే డ్రీమ్ చాలా ఏళ్లుగా ఉందట” అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆ కల నిజమయ్యేలా ఒక అవకాశం కూడా వచ్చింది. బాలీవుడ్ సీనియర్ హీరో గోవింద కుమారుడు యశ్వర్ధన్ అహుజా హీరోగా నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా ఫైనల్ అయ్యిందని వార్తలు వచ్చాయి.
Also Read : Varun-Tej : కొత్త లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్ తేజ్..!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఈ సినిమాతో కృతి బీ టౌన్ ఎంట్రీ ఖాయమని ఫ్యాన్స్ సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తాజా సమాచారం ప్రకారం, కృతి శెట్టి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం స్పష్టంగా బయటకు రాకపోయినా, స్క్రిప్ట్ మార్పులు, షెడ్యూల్ ఇష్యూలు, లేక వేరే ప్రాజెక్ట్ కమిట్‌మెంట్స్ కారణం కావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ వార్తతో ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. “ఇంత మంచి ఛాన్స్ వదులుకోవడం ఎందుకు?” అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే కృతి శెట్టి మాత్రం ఆ నిరాశలో నిలవకుండా, మళ్లీ కొత్త దిశగా ప్రయత్నాలు చేస్తోందట. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ ప్రాజెక్ట్స్ వింటూ, స్ట్రాంగ్ కం బ్యాక్ కోసం ప్లాన్ చేస్తోంది. “బాలీవుడ్ ఎంట్రీ ఆలస్యమైనా, ఒక సాలిడ్ ప్రాజెక్ట్‌తో వస్తే చాలు” అని ఆమెతో పాటు ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..