Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. పద్మాలయ స్టూడియోస్ నుంచి అంతిమయాత్రగా కృష్ణ పార్థివ దేహం మహా ప్రస్థానానికి చేరుకోగా.. మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి, కృష్ణ పార్థివదేహానికి పోలీసులు గౌరవ వందనం చేశారు.
అనంతరం మహేష్ బాబు సంప్రదాయబద్ధంగా తండ్రి చితికి నిప్పటించాడు. ఇక తమ అభిమాన హీరోను వదలలేక అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ అంత్యక్రియల్లో మహేష్ కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని కృష్ణకు కడసారి వీడ్కోలు పలికారు. అనంతరం మహా ప్రస్థానం నుంచి కృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు నిష్క్రమించారు.