Krishna Bhagavan: ఒకప్పుడు జబర్దస్త్ అంటే నాగబాబు నవ్వు.. ఆయన లేకుంటే.. జబర్దస్త్ షో కు అందం లేదు. అసలు చాలామంది ఆయన నవ్వుకోసం జబర్దస్త్ షో చూసేవారంటే అతిశయోక్తి కాదు. ఇక నాగబాబుకు తోడు రోజా పంచ్ లు, వారిద్దరి మధ్య శారద సంభాషణ, యాంకర్లపై, టీమ్ లీడర్స్ పై కౌంటర్లు.. అబ్బో బుల్లితెరపై టాప్ వన్ కామెడీ షోగా జబర్దస్త్ ను మార్చింది అంటే వారిద్దరే అని చెప్పాలి. ఇక నాగబాబు వెళ్ళిపోయాక జబర్దస్త్ కళ మారిపోయింది. ఉన్నకొద్దీ కామెడీ తగ్గిపోయి వల్గారిటీ ఎక్కువైపోయింది. నాగబాబు వెళ్ళిపోయినా వెంటనే ఒక్కొక్కరిగా జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేశారు కంటెస్టెంట్లు. ఇక రోజా కూడా అవెళ్లిపోవడంతో ఆ షోను చూడడం కూడా ఆపేశారు అభిమానులు. అయితే ఆ షోను మళ్లీ నిలబెట్టడానికి నిర్వాహకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. నాగబాబు ప్లేస్ లో సింగర్ మనోను తీసుకొచ్చారు. రోజా ప్లేస్ లో ఇంద్రజ ను రీప్లేస్ చేశారు. అయితే ఇంద్రజ అయితే సెట్ అయింది కానీ , నాగబాబుకు రీ ప్లేస్మెంట్ మాత్రం దొరకలేదు.
ఇక ఏ ముహూర్తాన జబర్దస్త్ లోకి కమెడియన్ కృష్ణ భగవాన్ అడుగుపెట్టాడో.. మళ్లీ అభిమానుల్లో ఆశలు చిగురించడం మొదలుపెట్టాయి. కృష్ణ భగవాన్ కామెడీ పంచ్ లు, టైమింగ్ కు కంటెస్టెంట్లే బెదిరిపోతున్నారు. స్వతహాగా కామెడీ టైమింగ్ ఉన్నఆయన షోకు వచ్చినప్పటి నుంచి షో రేటింగ్ పెరిగిందని టాక్. ఒకప్పుడు నాగబాబుకు, ఆయన పంచ్ లకు ఎంతమంది అభిమానులు ఉండేవారో ఇప్పడూ కృష్ణ భగవాన్ ను కూడా అంతే అభిమానిస్తున్నారు అభిమానులు. ఆ ఎక్స్ ప్రెషన్స్, కౌంటర్లు, సెటైర్లు.. అభిమానులకు నవ్వులు తెప్పిస్తున్నాయి. దీంతో కృష్ణ భగవాన్ ను పర్మినెంట్ జడ్జిగా చేసాయమం అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది ఎట్టకేలకు ఇన్నాళ్లకు నాగబాబుకు రీప్లేస్మెంట్ దొరికిందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ కమెడియన్ ఇలానే అలరిస్తాడేమో చూడాలి.