Konidela Ramcharan Upasana Child to be born tomorrow: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఉపాసన రాంచరణ్ వివాహం జరిగి చాలా సంవత్సరాలైనా వీరికి సంతానం లేకపోవడంతో అనేక రకాల ప్రచారాలు తేరి మీదకు వస్తూ ఉండేది. అయితే ఎట్టకేలకు వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు డాక్టర్లు రేపు ఉపాసనకు సంబంధించిన డెలివరీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇప్పుడు ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రవణం స్వామి నాయుడు ధ్రువీకరించారు.
Adipurush: నాకు ప్రొటెక్షన్ ఇప్పించండి.. పోలీసులకు ‘ఆదిపురుష్’ రైటర్ విజ్ఞప్తి!
ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. కొణిదెల ఇంట మూడో తరం రాకకు రేపే శుభ ముహూర్తం అంటూ ఆయన ఒక పోస్టర్ షేర్ చేశారు. మెగా కుటుంబంలో బుడిబుడి అడుగులకు శ్రీకారం, ఆ చిరంజీవి చిరు చిరు మురిపాలకు ఇదే ఆరంభం కావాలి, రామ్ చరణ్ ఉపాసన దంపతుల బిడ్డకు దేవదేవుల ఆశీర్వాదం అభిమానులై మనం చేసుకోవాలి అంబరాన్నంటే సంబరం, రామ్ చరణ్ ఉపాసన దంపతుల బిడ్డ పేరు మీద మెగా అభిమానులు రేపు అంటే జూన్ 20వ తేదీన మంగళవారం నాడు ఉదయం సమీప దేవాలయాల్లో పూజలు అర్చనలు చేయాలని కోరుకుంటున్నట్టుగా అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు పేర్కొన్నారు.