Koffee With Karan: బాలీవుడ్ సెలబ్రిటీ షో కాఫీ విత్ కరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రటీల రహస్యాలను బయటపెట్టడంలో కరణ్ తర్వాతే ఎవరైనా.. ఎఫైర్స్ నుంచి బెడ్ రూమ్ సీక్రెట్స్ వరకు ఏదైనా నిర్మొహమాటంగా అడిగేస్తాడు. ఇక చాలా మందికి ఈ షోలో ఎక్కువ బూతే కనిపిస్తూ ఉంటుంది. అందుకు కారణం కూడా కరణే. నిత్యం షోను హాట్ ఎక్కించడానికి గెస్టుల పర్సనల్ విషయాలను, రొమాంటిక్ విషయాలను అడిగి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇప్పటికే చాలామంది అలాంటి ప్రశ్నలు కూడా ఎదుర్కొన్నారు. ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ మల్లీశ్వరి కత్రీనా కైఫ్ వంతు వచ్చింది. గత ఎపిసోడ్ లో విక్కీ కౌశల్ సందడి చేయగా.. ఈ ఎపిసోడ్ లో కత్రీనా సందడి చేసింది.
ఇక ఈ భామను కూడా కరణ్ వదిలిపెట్టలేదు. శోభనం గురించి నిర్మొహమాటంగా అడిగేశాడు. పోయినసారి అలియాను శోభనం గురించి అడిగితే చాలా అలిసిపోయాం.. ఇంక శోభనం గురించి ఏం ఆలోచిస్తాం అని చెప్పుకొచ్చింది. మరి క్యాట్ మీ శోభన రాత్రి ఎలా జరిగింది..? అంటూ అడిగేశాడు. ఇక దీనికి క్యాట్ ఆన్సర్ చెప్తూ మేము శోభనం పగలు చేసుకున్నాం అని ఆన్సర్ ఇచ్చింది. దీంతో షాక్ అయిన కరణ్ ఓఓ.. నాక్కూడా పగలు అంటే ఇష్టం అంటూ అరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారాయి. కరణ్ నువ్వు మారవా.. ? అమ్మాయిలను ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావ్..? అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.