Kirrak Seetha:సినిమా.. ఒక వినోదాన్ని పంచే సాధనం. మూడు గంటల పాటు ప్రేక్షకులను వేరే లోకం తెలియకుండా చేసేది. ఇందులో చాలా పాత్రలు కల్పితం.. కొన్ని రియల్ గా చూపించినా.. అందులో నటించేవారు మాత్రం కేవలం నటిస్తున్నారు. అది చాలామంది గుర్తించడం లేదు. ఒక పాత్రకు కనెక్ట్ అయితే వారు బయటకూడా అలాగే ఉంటారు అని ఉహించుకుంటున్నారు. తాజాగా బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్యను బయట అందరు తిట్టుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయిల వలనే అబ్బాయిలు చెడిపోతున్నారు అంటూ ఆమె పోస్టర్ కనిపించినా చెప్పులతో కొడుతున్నారు. ఇక తాజాగా బేబీ సినిమాలో మార్ నాటికీ కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. బేబీ సినిమాలో వైష్ణవిది ఎంత ప్రాముఖ్యమైన పాత్రనో.. ఆమె ఫ్రెండ్ సీతది కూడా అంతే ప్రాముఖ్యమైన పాత్ర అని చెప్పాలి. సిటీ లైఫ్ కు అలవాటు పడి, చెడు స్నేహాలతో.. ఊరి నుంచి వచ్చిన వైష్ణవిని చెడగొట్టే పాత్రలో సీత కనిపించింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వైష్ణవి మీద ఎంత కోపం వస్తుందో ఆమె ఫ్రెండ్ సీత మీద అంతకంటే ఎక్కువ కోపం వస్తుంది. అది సినిమను బట్టి, పాత్రను బట్టి ఉంటుంది. కానీ, చాలామంది అభిమానులు బయట ఆ పాత్ర చేసిన సీతను బెదిరిస్తున్నారని ఆమె వాపోయింది.
YadammaRaju: జబర్దస్త్ నటుడికి యాక్సిడెంట్.. భార్య చేసిన పనికి బూతులు తిడుతున్న నెటిజన్స్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సీత మాట్లాడుతూ.. ” నేను ఈ పాత్ర చేసినదగ్గరనుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ సినిమాలో చేసిన పాత్రకు.. బయట నాకు ఎలాంటి సంబంధం లేదు. చాలామంది నన్ను పచ్చిబూతులు తిడుతూ కాల్స్ చేస్తున్నారు. నా అడ్రెస్స్ చెప్పమని వేధిస్తున్నారు. అదంతా బేబీ లో చేసిన పాత్ర వలనే. వారికి తెలియని విషయం ఏంటంటే.. రీల్ లైఫ్ కు రియల్ లైఫ్ కు చాలా తేడా ఉంది. నేను బయట అలా ఉండను. ఈ పాత్ర చేస్తున్నప్పుడే డైరెక్టర్ ఇలా జరుగుతుందని చెప్పాడు” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.