Pawan Kalyan : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే కె ర్యాంప్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కిరణ్. అయితే కిరణ్ మొదటి నుంచి పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే కదా. ఎన్నో ఈవెంట్లలో పవన్ గురించి చెబుతూనే వస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాత్రం పవన్ కల్యాణ్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు కిరణ్ అబ్బవరం.
Read Also : Bigg Boss 9 : నాగార్జున చేసిన పనికి ఏడ్చేసిన కంటెస్టెంట్లు
నేను రచయిత కావాలనే ఉద్దేశంతోనే సినిమాల్లోకి వచ్చాను. థియేటర్లలో పవన్ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేవాడ్ని. అనుకోకుండా నటుడిని అయ్యాను. ఇప్పుడు హీరోగా మంచి సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో నేను క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించలేను. ఎందుకంటే హీరోగా నా కెరీర్ ను ఇప్పుడిప్పుడే నిర్మించుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి టైమ్ లో పవన్ కల్యాణ్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఛాన్స్ వచ్చినా నటించను. కానీ ఆ పాత్ర కిరణ్ అబ్బవరం తప్ప ఎవరూ చేయలేరు అనేలా ఉంటే మాత్రం చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు కిరణ్. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Nara Rohith : నారా రోహిత్ ఇంట్లో మొదలైన పెళ్లి సందడి