Kiran Abbavaram Cameo in Vijay Leo Movie: హీరో కిరణ్ అబ్బవరం హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవల రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కుర్ర హీరో విజయ్ లియో సినిమాలో కిరణ్ అబ్బవరం అతిథి పాత్రలో కనిపించాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల దసరా కానుకగా రిలీజ్ అయిన లియో కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా విజయ్ సరసన అందాల భామ త్రిష హీరోయిన్ గా నటించింది. అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించగా అనిరుథ్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో కిరణ్ అబ్బవరం కూడా నటించాడు అని ఆయన వికీపీడియా పేజ్ చెబుతోంది.
నిజానికి సినిమా చూసిన వాళ్లకి లియోలో ఎక్కడా కిరణ్ అబ్బవరం కనపడలేదు కానీ వికీపీడియాలో మాత్రం కిరణ్ అబ్బవరం ఫిల్మోగ్రఫిలో లియో సినిమాలో అతిథి పాత్ర చేశాడని మీటర్ సినిమాలో ఆయన అర్జున్ కల్యాణ్ అనే పాత్రలో నటించగా అదే పాత్రలో కనిపించాడని వికీ పీడియాలో పేర్కొన్నారు. అయితే సినిమా చూసిన వారు అసలు లియో సినిమాలో కిరణ్ అబ్బవరం లేడు కదా వికీలో ఇలా ఎందుకు ఉందని కామెంట్స్ పెడుతున్నారు. కిరణ్ అబ్బవరం యాంటీ ఫ్యాన్స్ ఇలా చేసి ఉంటారని కొంతమంది అంటున్నారు. అయితే సినిమాలో రామ్ చరణ్ క్యామియో అని రిలీజ్ కు ముందు ప్రచారం జరగ్గా ఇప్పుడు కిరణ్ అబ్బవరం క్యామియో అని ప్రచారం జరుగుతోంది. ఇక ఆ మధ్య రూల్స్ రంజన్ సినిమా రిలీజ్ విషయంలో కూడా ఈయన సినిమా వస్తుందనే సలార్ వాయిదా వేసుకున్నారు అంటూ కూడా ట్రోల్స్ నడిచాయి. మొత్తం మీద ఏదైతేనేం కిరణ్ అబ్బవరం మాతరం ట్రెండ్ అవుతున్నాడు చాలు అనుకుంటున్నారు ఆయన అభిమానులు.
Whatsapp Image 2023 10 27 At 14.59.25 E5cc1830