అక్కినేని అభిమానులు థియేటర్స్ కి క్యూ కట్టి చాలా రోజులే అయ్యింది. ఈ మధ్య కాలంలో అఖిల్, చైతన్య నుంచి సరైన సినిమా రాకపోవడంతో డిజప్పాయింట్ అయిన అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి స్వయంగా కింగ్ నాగ్ రంగంలోకి దిగాడు. ఈరోజు తన పుట్టిన రోజు కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి నాగార్జున ‘మన్మథుడు’గా మళ్లీ థియేటర్స్ లోకి వచ్చాడు. తెలుగు ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న మన్మథుడు సినిమాని చూడడానికి అక్కినేని అభిమానులు మాత్రమే కాదు మొత్తం తెలుగు మూవీ లవర్స్ అంతా థియేటర్స్ కి వెళ్తున్నారు. ముఖ్యంగా రీరిలీజ్ అంటే అది అభిమానులకి మాత్రమే వర్తిస్తుంది కానీ మన్మథుడు సినిమాని అమ్మాయిలు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వెళ్లి చూస్తున్నారు. నాగ్ కి ఉన్న లేడీ ఫాలోయింగ్ ఈ జనరేషన్ యంగ్ స్టార్ హీరోలకి కూడా లేదనే మాటని నిజం చేస్తూ మన్మథుడు సినిమా రీరిలీజ్ థియేటర్స్ అన్నీ ప్యాక్ అయ్యాయి.
సోషల్ మీడియాలో మన్మథుడు రీరిలీజ్ థియేటర్స్ నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ సినీ అభిమానులు హంగామా చేస్తున్నారు. నాగార్జున గ్లామర్, బ్రహ్మీ కామెడీ, దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ మన్మథుడు సినిమాని ఒక క్లాసిక్ గా మార్చాయి. అలాంటి క్లాసిక్ సినిమా రీరిలీజ్ రికార్డ్స్ లో మంచి ప్లేస్ ని సొంతం చేసుకునేలా ఉంది. అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ఉండడంతో ‘నాగార్జున’ పేరు ట్రెండ్ అవుతుంది. కింగ్ నాగ్ హాష్ ట్యాగ్ తో పాటు ‘నాగ్ 99’ అనే హాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో చేస్తున్న సినిమా ‘నా సామి రంగ’ నుంచి ఈరోజు అనౌన్స్మెంట్ వీడియో బయటకి రానుంది. మరి ఈ వీడియో ఎలా ఉండబోతుంది, అక్కినేని ఫ్యాన్స్ కి ఎంత కిక్ ఇవ్వబోతుంది అనేది చూడాలి.