Hyper Aadi : వారణాసి ఈవెంట్ లో రాజమౌళి హనుమంతుడిపై చేసిన కామెంట్లు పెద్ద దుమారం లేపుతున్నాయి. ఇప్పటికే కొందరు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రాజమౌళి వారణాసి గ్లింప్స్ వీడియో లేట్ అయితే ఏకంగా దేవుడనే తప్పు పడతాడా అంటూ తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు రాజమౌళి గాని వారణాసి ఈవెంట్ టీం గానీ స్పందించలేదు. కానీ తాజాగా హైపర్ ఆది మాత్రం స్పందించాడు. ప్రియదర్శి హీరోగా వస్తున్న ప్రేమంటే మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు డైరెక్టర్లు, హీరోలపై ట్రోల్స్ చేయడం చాలా దారుణం అని అన్నాడు.
Read Also : Varanasi : వారణాసి చుట్టూ వివాదాలు.. మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన
వారణాసి ఈవెంట్ లో రాజమౌళి దేవుడిని అవమానించలేదని.. తన గ్లింప్స్ వీడియో లేట్ అయిందని హనుమంతుడిపై అలిగాడు తప్ప అవమానించలేదని తెలిపాడు హైపర్ ఆది. సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా సినీ సెలబ్రిటీలను ట్రోల్ చేయాలనే వాళ్లు ఎక్కువైపోయారని మండిపడ్డాడు. అందులో భాగంగానే రాజమౌళి ఏ పోస్టర్ వదిలినా దాన్ని ట్రోల్ చేయడం.. అల్లు అర్జున్ నవ్వితే ట్రోల్ చేయడం, చిరంజీవిపై ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం, రామ్ చరణ్ పై చేయడం.. ఇలా ఏది చేసినా సరే దానిపై ట్రోల్ చేయడం అలవాటు అయిందని ఇది తగ్గించుకోవాలని సూచించాడు హైపర్ ఆది.
Read Also : Andhra King Taluka Trailer: ఫ్యాన్స్‌ను ఎగతాళి చేశాడు రా.. ఆడికి మనమేంటో చూపెట్టాలి!