RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ హంగామా దాదాపు ముగిసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ది యావరేజ్ గా నిలిచింది. ఇక కొంత గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ RC17 తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ వంటి హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన సమాచారం ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీని పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. చరణ్, కియారా జోడీ గతంలో వినయ విధేయ రామ, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాల్లో కలిసి నటించారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే చరణ్‌తో కియారాకు ఇది మూడో సినిమా అవుతుంది. సుకుమార్ తన ‘పుష్ప’ తరహాలోనే ఈ చిత్రంలోనూ హీరోయిన్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పాత్రకు కియారా అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోందట. కానీ ఫ్యాన్స్ మాత్రం కియారా అంటే కాస్త భయపడుతున్నారు. ఇద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో కియారా కాకుండా ఇంకెవరైనా అయితే బాగుంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Anil Ravipudi : నేటి నుండి వెంకీ - కళ్యాణ్ రామ్ - అనిల్ ఆట షురూ
- Durefishan Saleem: పాక్ నటి డేటింగ్ రూమర్స్.. యూట్యూబర్‌తో పెళ్లి వార్తలపై మేకప్ ఆర్టిస్ట్ షాకింగ్ రియాక్షన్
- Jana Nayagan : జననాయగన్ రిలీజ్‌కు అన్ని దారులు క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
తాజావార్తలు
-
RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్
-
Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్‌ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్‌లో కనిపించిన కీలక లోపాలు
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!