Khushi Kapoor Bikini Photo: బోనీ కపూర్ -శ్రీదేవి దంపతుల చిన్న కూతురు ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఆమె బాలీవుడ్ లో ఇంకా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే అభిమానులను సంపాదించుకునేందుకు బోల్డ్‌నెస్ బాణాన్ని ఎక్కుపెట్టింది. అక్క జాన్వీ కపూర్ లాగే ఖుషీ కపూర్ కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండగా ఆ లుక్స్ అన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలు చూస్తుంటే ఖుషీ తన ఫిట్‌నెస్, అందంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల ఆమె తన కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది. వాటిలో ఆమె బికినీ లుక్ చాలా మంది అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఖుషీ కపూర్ మొత్తం 6 ఫోటోలను షేర్ చేసింది, వాటిలో కొన్ని ఆమె సెల్ఫీలు, కొన్ని ఆమె పెంపుడు కుక్క ఫోటోలు కూడా ఉన్నాయి. అందులో ఆమె బికినీ ఫోటో అయితే రచ్చ రేపుతోంది. ఆమె షేర్ చేసిన ఫోటోలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఫోటోలను అభిమానులే కాకుండా సెలబ్రిటీలు కూడా లైక్ చేస్తున్నారు. వైట్ హార్ట్ ఎమోజీతో ఉన్న తన ఫోటోకు క్యాప్షన్ ఇచ్చి తన ఫొటోలను ఖుషీ షేర్ చేసింది.
Shreya Dhanwanthary: అలనాటి హీరోయిన్ కొడుకుతో పీకల్లోతు ప్రేమలో శ్రేయ ధన్వంతరి?
ఖుషీ కపూర్ బోల్డ్ స్టైల్ ఈ ఫోటోలలో కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలో, ఖుషీ బ్లూ మరియు పింక్ కలర్ కాంబినేషన్‌లో బికినీ ధరించడం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఖుషీ షేర్ చేసిన అత్యంత ఆకర్షణీయమైన ఫోటోలలో ఇది ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖుషీ ఫోటోపై పలువురు స్టార్లు కూడా కామెంట్లు చేశారు. సోదరి జాన్వీ కపూర్ ఖుషీని బ్యూటీ అని కామెంట్ చేయగా పలువురు ఇతరులు కూడా ఆమె ఫోటో మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జోయా అక్తర్ యొక్క మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘ ది ఆర్చీస్’లో గ్లామరస్ నటి ఖుషీ కపూర్‌ను అభిమానులు త్వరలో చూడనున్నారు. ఈ మల్టీస్టారర్ అనేక మంది స్టార్ కిడ్స్ తో కూడి ఉంది. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా , అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఇక సినిమాను థియేటర్లలో విడుదల చేయరు కానీ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయనున్నారు.
Khushi Kapoor