మాస్ మహారాజ రవితేజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై నిర్మించారు. రవి తేజ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్నీయును ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 2021 మే 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అన్ని సినిమాల్లాగే “ఖిలాడీ” వాయిదా పడింది. ‘ఖిలాడీ’ ఫస్ట్ సాంగ్ “ఇష్టం”ను వినాయక చవితి కానుకగా రిలీజ్ చేశారు మేకర్స్. హీరో హీరోయిన్ల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి దీపావళి ట్రీట్ అంటూ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Read Also : “వరుడు కావలెను” ట్విట్టర్ రివ్యూ
“ఖిలాడీ” సెకండ్ సింగిల్ ను నవంబర్ 4న విడుదల చేయనున్నారు. అదే రోజు దీపావళి కూడా కావడంతో మాస్ మహారాజ అభిమానులకు అది దీపావళి ట్రీట్ అని చెప్పొచ్చు. సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.