Khaleja : మహేశ్ బాబు మరోసారి సత్తా చాటారు. కొత్త సినిమాలతోనే కాకుండా తన పాత ప్లాప్ సినిమాలతో రికార్డులు సృష్టిస్తున్నాడు. మే 30న రీ రిలీజ్ అయిన ఖలేజా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. రిలీజ్ అయిన రోజు నుంచే మంచి కలెక్షన్లు రాబడుతోంది. మూడు రోజుల్లో ఏకంగా రూ.11.83 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డు అని మూవీ మేకర్స్ చెబుతున్నారు. రిలీజ్ అయిన రోజు ఏకంగా రూ.5కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Read Also : Ali: రాజేంద్ర ప్రసాద్ బూతు వ్యాఖ్యలపై స్పందించిన అలీ‘
రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మహేశ్ బాబు, అనుష్క నటించిన ఖలేజా సినిమా 2010లో వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పట్లో పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇప్పుడు రీ రిలీజ్ లో అదరగొడుతోంది.
సోషల్ మీడియాలో ఖలేజా రీ రిలీజ్ థియేటర్లలోని సీన్లే వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ థియేటర్ల నిండా కనిపిస్తున్నారు. అటు ఓవర్సీస్ లో కూడా మూవీ అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే లక్ష డాలర్లకు పైగా వసూళ్లు రాటట్టింది. ఈ వీకెండ్ లో దీనికి కలెక్షన్లు పెరుగుతాయని చెబుతున్నారు.
Read Also : HHHVM : ‘వీరమల్లు’ ట్రైలర్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..