థియేటర్లలో రాఖీ భాయ్ వయోలెన్స్ స్టార్ట్ అయిపొయింది. ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కన్పిస్తోంది. KGF Chapter 2కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చిన్న సినిమాలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే సినిమా విడుదలను కన్ఫర్మ్ చేసుకున్న కొంతమంది హీరోలు, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతున్న రాఖీ భాయ్ ని చూసి వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పట్లో సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ వెనకడుగు వేస్తున్నారు.
Read Also : KGF Chapter 2 : 19 ఏళ్ల ఎడిటర్… ఈ ఆణిముత్యం ఎలా దొరికాడంటే ?
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద సినిమాల సునామీ మొదలైంది. రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద చిత్రాల కారణంగా గత నెల రోజులుగా లో-బడ్జెట్ సినిమాల విడుదలకు థియేటర్లు, సమయం రెండూ దొరకట్లేదు. ఈ పాన్ ఇండియా ఫీవర్ మధ్య ధైర్యం చేసి ముందుకు వచ్చిన స్టాండప్ రాహుల్, మిషన్ ఇంపాజిబుల్, గని లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కనీస వసూళ్లు సాధించలేదు. ఇప్పుడు ఆ మేనియాను KGF Chapter 2 కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమా సృష్టించిన తుఫాన్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ విడుదలకు సిద్ధమైన సినిమాలు వాయిదా పడుతున్నాయి. నాగశౌర్య “కృష్ణ బృందా విహారి”, విశ్వక్ సేన్ “అశోక వనంలో అర్జున కళ్యాణం” వంటి సినిమాలు ఏప్రిల్ 22 విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడ్డాయి.
ఈ రెండు చిన్న సినిమాల విడుదలకు, KGF2కి మధ్య ఒక వారం గ్యాప్ ఉన్నప్పటికీ, అది చాలా తక్కువ గ్యాప్ అని భావిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. బాక్స్ ఆఫీస్ వద్ద KGF Chapter 2 ఎఫెక్ట్ తగ్గాలంటే మరో రెండు మూడు వారాలన్నా ఖచ్చితంగా పడుతుంది. మరి ఆ తరువాత థియేటర్లలోకి వచ్చే సినిమాల పరిస్థితి ఏంటో చూడాలి.