Ashwani Dutt: టాలీవుడ్ బడా నిర్మాతల్లో అశ్వినీ దత్ ఒకరు. వైజయంతీ మూవీస్ బ్యార ఫై ఆయన ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ కు అందించారు.ఎన్టీఆర్ నుంచి మొదలైన ఆయన నిర్మాణ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వినీ దత్ తన గతంలోని మంచి చెడులను నెమరువేసుకున్నారు. అంతే కాకుండా మరెన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో వచ్చిన మహానటి సినిమాను మర్చిపోవడం ఏ ఒక్క తెలుగు ప్రేక్షకుడికి సాధ్యం కానీ పని. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా అశ్వినీ దత్ అల్లుడు నాగ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ కన్నా ముందు మరో హీరోయిన్ ను అనుకున్నారట. ఆ విషయాన్నీ అశ్వినీ దత్ రివీల్ చేశారు.
“మహానటి సినిమా కోసం ముందు ఒక మలయాళ నటిని అనుకున్నాం. కానీ ఆమె.. ఇందులో మందు సీన్ లు ఉంటాయా..? అవి తీసేయండి.. నటిస్తాను అని ఎవరితోనో చెప్పింది అంట. ఆ విషయం తెలియడంతో ఆ హీరోయిన్ ను పెట్టొద్దని నాగీకి చెప్పాను. ఆ తరువాత కీర్తి సురేష్ ను అనుకున్నాం… ఈ సినిమా ద్వారా ఆమెకు ఎంతటి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ మలయాళ నటి ఎవరో కాదు నిత్యా మీనన్ అని అంటున్నారు నెటిజన్లు. మొదట కీర్తి సురేష్ పాత్రలో నిత్యా మీనన్ నటించాల్సి ఉందని, కాకపోతే కొన్ని కారణాల వలన ఆగిపోయినట్లు చెప్పుకొచ్చారు. ఆ కారణం ఇదే అని అశ్వినీ దత్ ఇప్పుడు చెప్పుకొచ్చారు. ఇక ఇదే పాత్రను నిత్య కథానాయకుడు చిత్రంలో చేసి మెప్పించింది.