Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్‌కి కూడా అదే కారణమా?

Cinema

Cinema

Tollywood Item Songs: సినీ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ చేయడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపుతుంటారు. అయితే కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం ఎన్ని ఆఫర్లు వచ్చినా స్పెషల్ సాంగ్స్ చేయడానికి దూరంగానే ఉంటారు. కానీ తమకు అత్యంత సన్నిహితమైన హీరోలు, ప్రత్యేక అనుబంధం ఉన్న నటుల కోసం మాత్రం ఐటమ్ సాంగ్స్‌కు అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటి లీస్ట్‌లో నటి కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ 2013లో మలయాళ చిత్రం గీతాంజలితో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 13 ఏళ్ల కెరీర్‌లో గ్లామర్ పాత్రలకు కూడా దూరంగా ఉన్న ఆమె ఇప్పటివరకు ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయలేదు. అయితే తాజాగా నాని హీరోగా తెరకెక్కుతున్న ది పారడైస్ సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఈ పాటను సుమారు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నానితో ఉన్న స్నేహం కారణంగానే కీర్తి ఈ స్పెషల్ సాంగ్‌కు అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. గతంలో నాని-కీర్తి కాంబినేషన్‌లో వచ్చిన నేను లోకల్, దసరా చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో, ఈ జోడీపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన ఒక సినిమా, విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్‌లో నటిస్తుండగా, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో ది పారడైస్ కోసం స్పెషల్ సాంగ్‌కి డేట్లు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఇక త్రిష కూడా తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నడూ ఐటమ్ సాంగ్ చేయలేదు. అయితే తమిళ స్టార్ విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సినిమాలో ప్రత్యేక గీతంలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత మరిన్ని స్పెషల్ సాంగ్ ఆఫర్లు వచ్చినప్పటికీ ఆమె తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా సాధారణంగా ఐటమ్ సాంగ్స్‌కి దూరంగానే ఉన్నారు. అయితే ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగా జనతా గ్యారేజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతరం వచ్చిన ఇతర ఐటమ్ సాంగ్ అవకాశాలను కూడా ఆమె తిరస్కరించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగింది.