Keerthy Suresh: నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కీర్తి ఇక టాలీవుడ్ లో వెనుతిరిగి చూసుకోలేదు. ఇక మహానటి సావిత్రి బయోపిక్ తో ఒక్క టాలీవుడ్ నే కాదు చిత్ర పరిశ్రమ మొత్తం ఆమె వైపు తిరిగేలా చేసుకోంది. సావిత్రి పాత్రలో కీర్తి నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. ఈ సినిమాకు గాను అనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకొంది. ఏ నటికైనా తన కెరీర్ మొత్తంలో గుర్తుండిపోయే ఒక సినిమా ఉంటుంది. తన జీవిత కాలంలో కీర్తి ఎన్ని సినిమాలు చేసినా ఆమె కెరీర్ లో మహానటి నిలిచి ఉండిపోతుంది. ఇక ప్రస్తుతం కీర్తి వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఈ మధ్యనే సర్కారు వారి పాట చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తాజాగా దసరా సినిమాలో నటిస్తోంది.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి నాని లుక్, సాంగ్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు కీర్తి పుట్టినరోజు సందర్భంగా దసరా సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్.. ఇక ఈ చిత్రంలో కీర్తి వెన్నెల అనే పాత్రలో నటిస్తోంది. ఇక పోస్టర్ లో కీర్తి పెళ్లి కూతురు గెటప్ లో కనిపించింది. పసుపు రంగు చీర, మెడలో పసుపు తాడు తో తీన్మార్ స్టెప్స్ వేస్తూ కనిపించింది. కీర్తి లుక్ చూస్తుంటే డీ గ్లామర్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఈ మహానటి ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.