CM Revanth Reddy: బాలీవుడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతి షో గురించి తెలియని వారుండరు. బిగ్ బి అమితాబ్ బచ్చన్.. 24 ఏళ్లుగా ఈ షోను ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ఈ షోను రీమేక్ చేశారు కానీ, ఇక్కడ ఆంధ్ వర్క్ అవుట్ కాలేదు. ఎంతోమంది పేదవారిని ఈ షో కోటీశ్వరులను చేసింది. ఇక 24 ఏళ్లుగా అమితాబ్ ను కాపాడుతూ వస్తున్న షో అంటే ఇదే. ఇక ఈ షోలో ఎన్నో సార్లు మన తెలుగువారి ప్రస్తావన వచ్చింది. ఈ ఏడాది జాతీయ అవార్డు అందుకున్న హీరో ఎవరు అని అల్లు అర్జున్ గురించి కూడా అమితాబ్ ప్రశ్న వేశాడు. ఇక తాజాగా ఈ షోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రశ్న రావడం హాట్ టాపిక్ గా మారింది.
ఒక మహిళకు రూ.40 వేల ప్రశ్నగా రేవంత్ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అనే ప్రశ్నను అమితాబ్ ప్రశ్నించాడు. అందుకు ఆప్షన్స్ గా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధప్రదేశ్ అని చెప్పుకొచ్చాడు. అయితే సదురు మహిళ వెంటనే ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయింది. నాలుగు లైఫ్ లైన్ ల్లో ఒకటి అయిన ఆడియెన్స్ పోల్ ను సెలక్ట్ చేసుకుంది. ఇక ఆడియెన్స్ 80% తెలంగాణ అని చెప్పగా.. మరో 20% ఛత్తీస్‌గఢ్ అని చెప్పారు. అందులో ఎక్కువ శాతం మంది చెప్పిన తెలంగాణనే ఆమె ఆన్సర్ గా చెప్పింది. అది కరెక్ట్ అవ్వడంతో ఆ మహిళ రూ.40 వేలు గెలుచుకొని ముందుకు సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Shri Revanth Reddy belongs to Which state of Chief Minister?
Kaun Banega Crorepati 🔥🔥🔥♥️@revanth_anumula Please Must Watch pic.twitter.com/uIIocitS6e
— Ashish Singh (@AshishSinghKiJi) December 29, 2023