Katrina Kaif: టవల్ ఫైట్.. ఆవిరి నిండిన గదిలో ఎలా చేశామంటే ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Katrina Kaif: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వం వహించిన చిత్రం టైగర్ 3. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ మూవీని ఆదిత్య చోప్రా నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో కత్రీనా టవల్ ఫైట్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫైట్ సీన్ తో సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది.ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కత్రీనా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఇక ఈ ఫైట్ గురించి కత్రీనా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Thug Life: దింపు.. దింపు.. టాలీవుడ్, బాలీవుడ్ ను కూడా దింపు
Also Read
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
కత్రినా కైఫ్ మాట్లాడుతూ “అందరూ మెచ్చుకునేలా రిస్క్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాల్లో నటించటాన్ని నేనెంతో ఇష్టపడి కష్టపడి చేశాను. టైగర్ ఫ్రాంచైజీ చిత్రాల్లో నాకు మరచిపోలేని గొప్ప అనుభూతులున్నాయి. ఓ యాక్షన్ హీరోయిన్‌గా అవి నన్నెంతో గొప్పగా ఆవిష్కరించాయి. ఈ ఫ్రాంచైజీలో జోయా అనే స్పైగా నటించారు. జోయా ఓ ఫైటర్‌గా ఇందులో కనిపిస్తుంది. టైగర్‌లాగానే ఆమె ఎవరినైనా ఎదిరించటమే కాదు, తుది వరకు నిలబడి పోరాడుతుంది. అందుకనే ఆ పాత్రలో నటించటానికి నేనెప్పుడూ ఎగ్జయిట్ అవుతుంటాను. ఈ పాత్రను పురుషులతో సమానంగా పోరాడే ఓ మహిళను ఆడియెన్స్ చూస్తారు. ఇక హమామ్‌లో చిత్రీకరించిన టవల్ ఫైట్ ఇంటర్నెట్‌లో ఎంతో వైరల్ అయ్యింది. అయితే ఆఫైట్‌ను ఎంతో కష్టపడి చిత్రకరించాం. ఎందుకంటే ఆవిరులతో నిండిన గదిలో పోటాపోటీగా సాగే ఫైట్ ఇది. దీన్ని గ్రిప్పింగ్ కిక్స్, పంచ్‌లతో చేయటం ఎంతో కష్టంతో కూడుకున్నది.
Salaar: సలార్ మరోసారి వాయిదా.. మాస్ మహారాజాకు కలిసొచ్చేలా ఉందే.. ?
ఇద్దరు మహిళలు ఇలా నువ్వా నేనా అనేంతగా పోరాడే ఫైట్ సీన్ ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై రాలేదు. ఇలాంటి ఆలోచన చేసిన ఆదికి ధన్యవాదాలు. డైరెక్టర్ మనీష్, యాక్షన్ టీమ్ ఈ ఫైట్ సీన్‌ను ప్లానింగ్‌తో చిత్రీకరించిన విధానానికి హ్యాట్సాఫ్. ఇదొక టీమ్ ఎఫ్టర్. చూసే వారందరికీ నచ్చుతుంది. ఇందులో టవల్ ఫైట్‌లోనాతో మిచెల్ లీ నటించారు. మా మధ్య జరిగే ఈ ఫైట్ సీన్ మెప్పిస్తుందని నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకు చాలా మంది మహిళలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై యాక్షన్ సీక్వెన్స్‌లో నటించారు. అయితే వాటిలో కొన్ని మాత్రమే బెస్ట్‌గా నిలిచాయి. అలాంటి బెస్ట్ ఫైట్స్‌లో ఇదొకటిగా నిలుస్తుంది. దీనికి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు