Karthikeya: యు.ఎస్.ఎ.లో ‘బెదురులంక 2012’ సరికొత్త రికార్డ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bedurulanka 2012: హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘బెదురలంక 2012’. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫొటో’ నిర్మాతలలో ఒకరైన రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రమిది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీ గురించి నిర్మాత బెనర్జీ మాట్లాడుతూ, ”కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారు. ‘స్వర్గీయ’ సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు పూర్తయిపోయింది. యు.ఎస్.ఎ.లో గతంలో ఎన్నడూ లేని విధంగా కార్తికేయ చిత్రానికి థియేట్రికల్ రైట్స్ కు 80 లక్షల ఆఫర్ వచ్చింది. ది విలేజ్ గ్రూపీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ హక్కుల్ని సొంతం చేసుకుంది. అలానే మా సినిమా మ్యూజిక్ రైట్స్ ను సోనీ మ్యూజిక్ సంస్థ రూ. 50 లక్షలకు పొందింది” అని అన్నారు.
Also Read
- Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్మార్క్ సెట్ చేయబోతుందా?
- Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
- Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
- Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. సొసైటీకి నచ్చినట్లు బతకడం రైటా? మనసుకు నచ్చినట్టు బతకడం రైటా? అనేది సినిమాలో చూడాలి” అని చెప్పారు. థియేటర్లలో విడుదల అనంతరం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
-
Volkswagen Tayron: వోక్స్వ్యాగన్ టేరాన్ లైఫ్ లాంచ్.. 9 ఎయిర్బ్యాగ్స్, లెవెల్-2 ADASతో ప్రీమియం SUV.. ధర, ఫీచర్లు ఇవే
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
-
Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!